రోడ్ల దుస్థితిపై ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన దాసరి రాజు

శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం, బి.గొనపపుట్టుగ గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న తుంగానపుట్టుగ, గుమ్మడి పుట్టుగ, తడక పుట్టుగ, లొట్టి పుట్టుగ, పర్రి పుట్టుగ, బంజు పుట్టుగ మరియు చెవిటి పుట్టుగ గ్రామాలలో మట్టి రోడ్డు (కంకర రోడ్డు) అధ్వాన్న స్థితిలో ఉంది. రోడ్డు మొత్తం గుంతలు మరియు ఇసుక కూరుకు పోవడంతో కనీసం మోటార్ సైకిల్ వెళ్లేందుకు కూడా సౌకర్యం లేదు. దీని వల్ల ఆ గ్రామాలలో ఉన్న ప్రజలు చాలా అవస్థలకు గురి అవుతున్నారు. అంతే కాకుండా గర్భిణీ స్త్రీలు రాకపోకలకు మరియు అత్యవసర పరిస్థితుల్లో వైద్యము నిమిత్తం అంబులెన్స్ రావడానికి కూడా రోడ్లు సరిగా లేవు. ఈ రోడ్డు మార్గంలో పాఠశాలలకు మరియు కళాశాలలకు సైకిళ్ళపై వెళ్ళే విద్యార్థులు అధికంగా ఉండడంతో వారి రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉందని ఆ పంచాయతీలోని జనసైనికులు ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు దృష్టికి తీసుకెళ్లగా బుధవారం ఆయన బి.గొనపపుట్టుగ పంచాయితీలో పలు గ్రామాల్ని సందర్శించి రోడ్ల దుస్థితిని చూసి, అక్కడ గ్రామ పెద్దలు, ప్రజలతో మాట్లాడి సంతకాలు స్వీకరించి, బి.గొనపపుట్టుగ పంచాయితీలో గల 6 గ్రామాలుతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు రోడ్లు సరిగా లేక పడుతున్న అవస్థలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కవిటి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జనసేన నాయకులతో కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ కవిటి మండలంలో ఎందరో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని ఉన్నత పదవులు చేపట్టారని కానీ నేటికీ మారుమూలన ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి చూస్తే సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నేళ్లు పదవుల్లో ఉంటూ మరి మన నాయకులు ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. వినతిపత్రం అందించిన వారిలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, ఇచ్చాపురం మున్సిపాలిటీ 10 వార్డు ఇంచార్జ్ రోకళ్ళ భాస్కర్, బడగల రామకృష్ణ, లోల్ల సాగర్, నర్తు కృష్ణ , దూగాన దివాకర్, హేమాచలపతి, దేవా, రాజశేఖర్, శ్యామ్, ధనుంజయం, అమిత్ తదితరులు పాల్గొన్నారు.