కవిటి ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి.. సమస్యలు తెలుసుకున్న దాసరి రాజు

ఇచ్ఛాపురం, కవిటి మండలంలో గల ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న సమస్యలను సామాన్యులు గుర్తించి జనసైనికులు దృష్టికి తీసుకువచ్చారు. జనసైనికులు ఆ సమస్యను ఇచ్ఛాపురం నియోజక వర్గ జనసేన సమన్వయ కర్త దాసరి రాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బుధవారం ఇచ్ఛాపురం కవిటి సి హెచ్ సి హాస్పిటల్ ను సందర్శించి.. అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం హస్పిటల్ ఆవరణంలో సానిటైజేషన్ సరిగా లేదు. డ్రైనేజీ సమస్య ఎక్కువ గా ఉండటం వల్ల, డయాలసిస్ చేసిన తర్వాత వ్యర్ధాలు, టాయిలెట్స్ నుండి వెలువడే వ్యర్ధాలు, మురికినీరు అంతా ఏకమై హాస్పిటల్ బయట అవరణంలోకి వచ్చి చేరి, నిల్వ ఉంటుంది. దీని వల్ల అక్కడ దోమలు, ఈగలు చేరుతున్నాయి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా గైనకాలిజిస్ట్ లేకపోవడం ప్రధానమైన సమస్య. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉన్నా సరే గైనకాలిజిస్ట్ లేనందున గర్భిణీ స్త్రీలు దూరప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆధారపడవల్సి వస్తుంది. స్టాఫ్ నర్స్ కొరత ఉంది. దాసరి రాజు మాట్లాడుతూ.. ఇక్కడ ముఖ్యంగా ఉన్న టీ.బి సెంటర్ సోంపేట తరలించారని నా దృష్టికి వచ్చింది. కవిటి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో టీ.బి పేషెంట్లు అధికంగా ఉన్న నేపధ్యంలో టీ.బి సెంటర్ సోంపేట తరలించడం ఎంతవరకు సమంజసమని, ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని, ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ సమస్యను వారం రోజుల్లో పరిష్కరించకపోతే జనసేన పార్టీ తరపున ధర్నా చేపడతాం అని అన్నారు. హాస్పిటల్ ను సందర్శించిన వారిలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10వ వార్డు ఇంఛార్జి రోకళ్ల భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, బెజ్జిపుట్టుగ ఎంపీటీసీ అభ్యర్థి గుల్ల కుర్మరావు, జనసైనికులు దుగాన దివాకర్, బడగల రామక్రిష్ణ, ధనుంజయం శ్యామ్, రాజా తదితరులు పాల్గొన్నారు.