బత్తుల చంద్రశేఖర్ కు నిత్యవసర సరుకుల పంపిణీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, పొన్నమండ గ్రామానికి చెందిన బత్తుల చంద్రశేఖర్ అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం బత్తుల చంద్రశేఖర్ ని కలసి ఫీల్డ్ లేబర్ సొసైటీ వారి సమక్షంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు మరియు పింక్ హార్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ లేబర్ సొసైటీ ప్రెసిడెంట్ కుసుమ రాజ్ కుమార్, రాపాక మహేష్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.