జెడ్.పి.హెచ్ స్కూల్ ను సందర్శించి.. విద్యార్ధుల సమస్యలు తెలుసుకొన్న దాసరి రాజు

ఇచ్ఛాపురం కవిటి మండలం కవిటి మేజర్ పంచాయితీ లో ఉన్న జెడ్ . పి .హెచ్ ఒరియా మీడియం స్కూల్ లో విద్యార్ధులు పడుతున్న ఇబ్బందిని స్థానికంగా ఉంటున్న జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా దృష్టికి స్థానికులు తీసుకురావడంతో, ఆ విషయాన్ని హరి బెహరా ఇచ్ఛాపురం నియోజక వర్గ సమన్వయ కర్త దాసరి రాజుతో సంప్రదించడంతో ఆయన బుధవారం కవిటి లోని ఒరియా స్కూల్ ను సందర్శించడం జరిగింది. అక్కడ పరిస్థితి చూసి దాసరి రాజు మాట్లాడుతూ.. రెండు గదుల్లో దాదాపుగా 6,7,8,9,10 తరగతులకు చెందిన విద్యార్థులను ఉంచి బోధిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కు ఎంతో అవసరం అయిన విద్యను రెండు గదుల్లో దాదాపు 71 మంది పిల్లలను పెట్టి బోధిస్తే వాళ్లకు ఏం అర్థం అవుతుంది. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు మొత్తం రూపు రేఖలు మార్చాం అని చెప్పుకొనే అంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక్కడ ఒరియా మీడియం చదువుకొనే పిల్లల భవిష్యత్ పై ఎందుకు ఇంత నిర్లక్ష్యం. పాత భవనం ఉన్నపుడు సుమారు 150 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు అని, ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్ భవనంలో కేవలం రెండే గదుల్లో తరగతులు బోధించడంతో చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ కు తరలి వెళ్లారు. కనీసం ఉపాధ్యాయులు కూడా లేరు. కేవలం నలుగురు ఉపాధ్యాయులతో ఐదు తరగతులకు చెందిన విద్యార్థులకు బోధన జరుగుతుంది. వెంటనే పాత భవనంను నాడు నేడు కార్యక్రమం కింద బాగుచేసి, ఉపాధ్యాయులను నియమించాలి అని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. పాఠశాలను సందర్శించిన వారిలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10 వ వార్డు ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, మరియు జనసైనికులు దుగాన దివాకర్, రామకృష్ణ, శ్యామ్, ధనుంజయ, అరుణ్ బెహార, రాజా తదితరులు పాల్గొన్నారు.