దత్తిరాజేరు మండల జనసేన ఆత్మీయ సమావేశం

గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజేరు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చప్ప అప్పారావు అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం మండల కమిటీ మరియు బూత్ కమిటీ లీడర్లను నియమించుటకు వి.కృష్ణాపురం గ్రామంలో మండల కమిటీ మెంబర్లని ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ జనసేన పార్టీని గెలిపించుటకు మీరు ఎంతో కృషితో ప్రతి గ్రామంలోనూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు మార్పిని అప్పలనాయుడు, సారకి మురళి, బెజవాడ అనిల్, సూర్య బొబ్బాది, రామచంద్రరావు, చరణ్, ప్రవీణ్ జన సైనికులు మరియు క్రియాశీల సభ్యులు పాల్గొనడం జరిగింది.