పవనన్న ప్రజా బాట 99వ రోజు

రాజంపేట నియోజకవర్గం: నందలూరు మండల పరిధిలో పవనన్న ప్రజా బాట 99వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా విజయవంతం అవ్వాలని ఆయన పేరు మీద అర్చన కార్యక్రమం నిర్వహించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరు మండల పరిధిలో నడిగడ్డ గ్రామంలో ఉండే పోకురి, ఆంజనేయ, చిన్నయ్య గార్ల కుటుంబాలకు ఆరోగ్య రిత్యా వైద్య ఖర్చులకు జనసేన పార్టీ తరపున మానవత్వ సేవా దృక్పథంతో నాయకులు, జనసైనికులు, వీరమహిళల సహకారంతో వారి కుటుంబాలకు 75,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అనంతరం అదే గ్రామంలో స్థానిక నాయకులు, జనసైనికులు, నేతృత్వంలో 99వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో పాల్గొన్న! జనసేన నాయకులు రామ శ్రీనివాస్ ఇతర నాయకులతో కలిసి ప్రతి గడపకు ప్రజల వద్దకు వెళ్ళి గత, ప్రస్తుత ప్రభుత్వాలు చూశారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాసంక్షేమ పథకాలు ద్వారా భావితరాల భవిష్యత్తుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి సమసమాజం కోసం ఓటరు మహస్రేయులందరూ జనసేనపార్టీ వైపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే మన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు గుర్తుకు ఓట్లు వేసి వేపించి జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపనకు ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి, స్థానిక నాయకులు, జనసైనికులు, మహిళలు, అభిమానులు, మద్దతు దారులు, చుట్టుపక్కల గ్రామస్థులు, యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.