బైక్ యాత్రలో భాగంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దీపక్

పిఠాపురం: వరంగల్ జిల్లాకు చెందిన గూండగాని దీపక్ అనే నిస్వార్థ జన సైనికుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైక్ యాత్ర మొదలుపెట్టారు. యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా బైక్ యాత్ర మొదలుపెట్టిన దీపక్ కి అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ తమ్ముణ్ణి ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే వరకు ప్రతి జనసైనికుడు కనీసం రోజుకి రెండు కుటుంబాల్ని మార్చగలిగితే 2024 లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పడం జరిగింది. డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో దీపక్ కి చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పి వీరబాబు, పిల్లా శివ శంకర్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.