విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి.. జనసేన డిమాండ్

గోపాలపురం నియోజకవర్గం: నల్లజర్ల మండలం, నల్లజర్ల గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉన్నటువంటి సమస్యలను ఆ స్కూల్ విద్యార్థులు తమ సమస్యలైన స్కూల్ గదులలో ఫ్యాన్లు సరిగా లేకపోవడం, బాత్రూం క్లీనింగ్ సరిగా లేకపోవడం, టీసీలు గురించి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం, డ్రింకింగ్ సమస్య, యూనిఫాం మొదలగు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సమస్యపై వెంటనే స్పందించిన నల్లజర్ల మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల అధ్యక్షులు చొడసాని బాపిరాజు, మండల నాయకులు రుద్ర శీను, గుండా బత్తుల వరుణ్, ఎర్ర బాలాజీ, కొత్తపల్లి హరిబాబు, తలంశెట్టి శివాజీ, కంపన సాయి మరియు జనసైనికులతో కలిసి హైస్కూల్ హెచ్ ఎం స్కూలులో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని మళ్లీ మళ్లీ మీ వద్దకు ఈ సమస్యలపై వచ్చేటువంటి పరిస్థితిని తీసుకురావద్దని చెప్పడం జరిగింది. స్కూల్లో సమస్య తెలిసిన వెంటనే స్పందించి అక్కడ ఉన్న మండల మరియు గ్రామ నాయకులతో కలిసి సమస్యలను హెచ్ ఎం కి తెలియజేసి పరిష్కరించాలని డిమాండ్ చేసినటువంటి మండల అధ్యక్షులు చొడసాని బాపిరాజు, మండల నాయకులు రుద్ర శీను మరియు ఇతర నాయకులకు, జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.