పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: జనసేన డిమాండ్

గుంటూరు: మంగళగిరి వడ్డేశ్వరంలో గల కమిషనర్ మరియు డైరెక్టర్, పురపాలక పరిపాలన శాఖ కార్యాలయములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సి&డిఎమ్ఏ ను ది గుంటూరు మునిసిపల్ శానిటేషన్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సోమి శంకర్రావు కలిసి గుంటూరులో పని చేసే ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు గత 5 నెలలుగా హెల్త్ అలవెన్సులు కార్మికుల ఖాతాలో జమకావడం లేదని తెలియజేసినారు. అలాగే విధినిర్వహణలో మరణించిన ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడం లేదని జనసేన కార్మిక నాయకులు సో ఉదయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారి కార్మిక సమస్యలపై స్పందిస్తూ గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం వారి నిర్లక్ష్యం వల్లే 5 నెలలుగా కార్మికుల ఖాతాలో హెల్త్ అలవెన్స్ లు జమ కావడం లేదు కావున గుంటూరు లోనే మీరు పరిష్కార మార్గాలు వెతకాలని సూచించారు.