రైతుల కుటుంబాలకు బాసటగా నిలిచిన జనసేనానికి పాలభిషేకం చేసిన దెందులూరు జనసేన

దెందులూరు, ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు 80 లక్షల రూపాయల సాయం జనసేన తరఫున అందించాలని నిర్ణయించిణ సందర్భంగా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లోని రామసింగవరం గ్రామంలో రైతులు, జనసైనికులు జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేశారు. చట్టసభల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ రైతుల గురించి ఇంతగా ఆలోచించి ఈ రకంగా ఆర్దిక సహాయం చేసిన చరిత్ర లేదని ఇలా ప్రజల కష్టాలకి స్పందించే నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే.. అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఇవాళ నిజంగా ఇటువంటి నాయకుని అధ్యక్షతన పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం అని సాయి శరత్ అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి లోపభూయిష్టమైన చట్టాలను రద్దు చెయ్యాలని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందచేయాలని లేని పక్షంలో జనసేన వారి కుటుంబాల తరఫున ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం చేస్తుందని సాయి శరత్ తెలిపారు.