డెంకాడ మండల జనసేన ఆత్మీయ సమావేశం

నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండలం సీనియర్ నాయకులు మరియు జనసైనికులు, బూత్ ఏజెంట్లు మరియు నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకి వెళ్ళాలో మీటింగులో చర్చించడం జరిగింది. మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ద్రుష్టి పెట్టి ప్రజా ఉద్యమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలని తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేసంలో దిండి రామారావు, తొత్తడి సూర్యప్రకాష్, పిన్నింటి రాజారావు, రామ్ లక్ష్మణులు, రామారావు, త్రిపరగిరి రాంబాబు, ప్రసాదు, నవీన్, నాయుడు, రఘు, నారాయణప్పుడు. శివ, సురేష్, వెంక నాయుడు, సంతోష్, ప్రసాద్ మొదలగు సీనియర్ జనసేన నాయకులు మరియు జనసైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.