అంబేద్కర్ కు నివాళులు అర్పించిన దేవ వరప్రసాద్

రాజోలు: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక అసమానతలవల్ల చీకటి నిండిన కోట్లాది కుటుంబాలకు వెలుగురేఖ, ప్రపంచదేశాలు విశ్వవిజ్ఞాన దినోత్సవాన్ని తనకు గుర్తుగా ప్రకటించే విధంగా పేరుగాంచిన నడిచే గ్రంధాలయం, చరిత్రఉన్నంతకాలం చరిత్ర సృష్టించాలని కోరుకునే వారికోసం ఎల్లప్పుడూ ఆదర్శవంతంగా నిలిచే మహనీయులు అయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సఖినేటిపల్లి మండలం మూడు తూములు సెంటర్ లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులఆర్పించిన రాజోలు నియోజక వర్గ జనసేన టీడీపి బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వరప్రసాద్ మరియు నాయకులు.