అంధకారంలో చంద్రగిరి

  • చంద్రగిరి చరిత్ర తెలుసుకో మనవడా అని చెప్పిన జనసేన ఇంఛార్జి దేవర మనోహర

రాయలసీమ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం చంద్రగిరి, రాయలు వారు ఏలినట్టి ఈ చంద్రగిరిని ఈరోజుకి అంధకారంలో, అభివృద్ధి లేకుండా చేసిన ఘనత చెవిరెడ్డి గారికే చెందుతుంది అనే చెప్పేదానికి ఎటువంటి అతిశయోక్తి లేదని జనసేన ఇంఛార్జి దేవర మనోహర పేర్కొన్నారు. బుధవారం దేవర మనోహర మీడియా ముఖంగా మాట్లాడుతూ.. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మీకన్నా 50 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందు చూపుతో తన అనుభవాన్ని జోడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా లేక నవ్యాంధ్రప్రదేశ్ అయినా అభివృద్ధి వైపు నడిపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిది, అటువంటి వ్యక్తిని అవహేళన చేస్తూ తాత, తాత అని సంబోధించే సంస్కృతి మీది. మీ తాత గారు మరియు శ్రీ చంద్రబాబు గారు కలిసి చదువుకుంటే మీ తాత గారు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు..? నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడుతూ రెండు ఓట్లు ఒకటన్నర ఓటు అని అన్నారు,ఒకటన్న ఓటు అనే ఓటు కూడా ఎలక్షన్లలో ఉంటుందని మొట్టమొదటిగా ప్రజలకు అధికారులకు తెలియజేసిన ఘనత మీదేనండి బాబు. ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఒక పక్క మరోపక్క ఎవరి అండదండలు రాజకీయ గురువులు లేక ఒంటరిగా వచ్చి దశాబ్ద కాలం పైగా ప్రజల మనలను పొందిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో పక్క కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు చంద్రగిరిలో జరిగే దొంగ ఓట్ల గురించి నివేదిక ఇస్తే కనీసం ఒక మండలానికి పరిమితమైన కొందరు ప్రశ్నించడం హాస్యాస్పదం. 2019లో మీ వయస్సు 20 సంవత్సరాలు అంటే మొదటి ఓటు వినియోగించుకున్నారు, అప్పుడే ఒక పోలింగ్ బూత్ మొఖం చూడటం కూడా,అలాంటిది మీరు ఎంతో అపార రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం మరియు నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత పెద్ద నియోజకవర్గమైనా ఐదేళ్లలో 2 నుండి 5 శాతం ఓట్లు పెరుగుతాయి అలా చూసుకున్నా 2019 లో ఉన్న 2,91,734 ఓట్లు కాస్త 2024 కు 3,08,000 పై చిలుకు రావడం అంటే దాదాపు 8 శాతం పైన కానీ అధికారులు చెపుతున్న దానితో పోలిస్తే డెత్ ఓట్లు, మైగ్రేషన్ ఓట్లు, కొత్త ఓట్లు అన్ని చూస్తే ఘనికంగా చాలా అధికంగానే వస్తాయి. దీనికి కారణం సున్నా ఓట్లను భారీగా నమోదు చెయ్యడం, డెత్ ఓట్లను తీసివేయకపోవడం, కొత్త దొంగ ఓట్లను చేర్చడం ఇది మీకు వెన్నతో పెట్టిన విధ్యలాంటిది. దీనికి మీరు చెప్పే సమాధానం చంద్రగిరిలో వలసలు కొత్త ఇండ్లు అంటున్నారు. చంద్రగిరిని చెవిరెడ్డి ఏమి అభివృద్ధి చేశారని ప్రజలు వలసలు వచ్చి ఇక్కడ నివసిస్తారు, భారీ పరిశ్రమలు తెచ్చారా, ఐఐటీ కాలేజీలు కట్టారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు పెట్టరా, పర్యావరణ అభివృద్ధి చేశారా. ఏమి చేశారని ప్రజలు ఇక్కడికి వచ్చి నివసించాలనుకుంటారు, గత పదేళ్లుగా చంద్రగిరిలో చెవిరెడ్డి ఉన్నారు కానీ 2014 లో ఎలా వుందో ఈరోజుకి అలానే ఉంది ఎటువంటి మార్పు లేదు, నా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి చేశారని ఈరోజు ఓట్లు అడగడానికి వస్తారు. తాయిలాలు ఇచ్చి ప్రజలను కట్టిపడేస్తే చాలు ప్రజలు ఏ అభివృద్ధి గురించి అడగరనే ధీమాతో ఇన్నేళ్ళు నెట్టుకొచ్చారు, ఇక అది చెల్లదు మీరు ఇచ్చే స్వీట్ బాక్సులు, గోడ గడియారాలు నా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల జీవితాలు మారవు. నా తమ్ముడ్లకు, చెల్లెలకు కావల్సింది ఒక ఉన్నత విద్యను అభ్యసించకలిగే పాటశాలలు, కళాశాలలు.. నా అన్నలకు, అక్కలకు కావాల్సింది మెరుగైన జీవన విధానం గడిపేందుకు దోహదపడే పరిశ్రమలు, పెట్టుబడి పెట్టుకునే ఆర్థిక వనరులు మరియు వ్యసాయం చేసుకునేందుకు ప్రభుత్వ వెసులుబాట్లు. మా అవ్వ, తాతలకు కావల్సింది మెరుగైన వైద్యం, 100 పడకల ఉన్నత ఆసుపత్రి, ఇవి మేము కోరుకునేది అంతేకాని మీరు ఇచ్చే తాయిలాలు కాదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం నా చంద్రగిరి ప్రజలకు బస్టాండ్ కట్టించలేకపోయారు మీరు కూడా అభివృద్ధి గురించి నా ప్రజలు అని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు పదేళ్ళలో చెయ్యలేని అభివృద్ధిని రానున్న జనసేన – టిడిపి ప్రభుత్వంలో చేసి చూపిస్తాం. అధికారంలో ఉండి ప్రజలకు కావాల్సిన మాలిక సౌకర్యాలను అందిచలేక ఉన్నారు అంటే మీ చేతకాని తనమా లేక ప్రభుత్వంపై ఒత్తిడి తెలేకపోయారా.. మీ చేతకాని తనమైతే దానికి ప్రజలు రానున్న ఎన్నికల్లో భుద్ది చెపుతారు లేక ప్రభుత్వంపై ఒత్తిడి చేయ్యాడానికి ధైర్యం సరిపోకపోతే చెప్పండి మీకు తోడుగా నేను కూడా కూర్చుంటా ఇద్దరూ కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేద్దాం. దొంగ ఓట్లను, దొర ఓట్లుగా చేయడానికి మీరు నిరాహార దీక్ష చేయగలిగింది, ప్రజల అవసరాలకు చేయలేరా..!