ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, నేలటూరు హరిజన వాడ. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు మాట్లాడుతూ నేలటూరు ఏపి గెంకో ప్రయివేటీకరణను ఆపాలని, ఆ సంస్థ నిర్మాణానికి మా భూములు ఇచ్చామని, మాకు హామీగా ఆ సంస్థలో శాశ్వతమైన జాబ్ లని నమ్మించి స్థానికులకు ఇచ్చారు. ఇప్పుడు ప్రయివేటీకరణ చేస్తే మా జాబ్ లకు భద్రత ఏది? అంటూ జనసేన నాయకులతో వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సి.హెచ్.కసుమూరు, తాండ్ర శ్రీను, ఏపూరు నాగేంద్ర, ఊటుకూరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.