ధర్మారెడ్డి హటావో.. టీటీడీ బచావో..!

*ఏపిలో రెండు ప్రభుత్వాల పాలన సాగుతుంది.. ఒకటి జగన్ రెడ్డి ప్రభుత్వం, రెండు ధర్మారెడ్డి ప్రభుత్వం.. జనసేన నేత కిరణ్ రాయల్

*ధర్మారెడ్డి లాంటి అధికారులు వస్తుంటారు.. పోతుంటారు తిరుపతి వాసులుగా మనం లోకల్… ఆధార్ కార్డు కూడా ఇక్కడ లేదు అనుకుంటా..

*టీటీడీ వెంకన్న తాతను ఈ అధికారి నుండి మనమే కాపాడుకోవాలి..

*టీటీడీ ఉద్యోగస్తులు, అటవీ కార్మికులు, ఎఫ్ఎంఎస్ కార్మికుల కోసమే ఈ పోరాటం.. జనసేన వెల్లడి..

రాష్ట్రంలో జగన్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాక్షస పాలన కొనసాగిస్తున్నాడని జనసేన తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకులు రాజా రెడ్డి, రాజేష్ యాదవ్, మునస్వామి, సుమన్, హేమ కుమార్, కిషోర్, సాయి దేవ్ లతో కలిసి మీడియాతో.. ఆయన మాట్లాడుతూ.. పాలక ప్రజాప్రతినిధుల లెటర్లను వినియోగించుకుంటూ ధర్మారెడ్డి ఆయన ప్రమేయం లేనట్లుగా.. ధర్మపాలన కొనసాగిస్తున్నట్లు నటిస్తూ శ్రీవారి దర్శనాలలో అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు..

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తనకు ఫోన్ చేసి ధర్మారెడ్డి టీటీడీలో కొనసాగే ప్రసక్తే లేదని చెప్పారని.. ఇలాంటి అధర్మ ధర్మారెడ్డి పై హైకోర్టు కూడా వెళతామన్నారు..

టిటిడి ఉద్యోగులు ధర్మారెడ్డి కి భయపడాల్సిన అవసరం లేదని, మా పోరాటం అంతా మీ కోసమేనని టిటిడి ఉద్యోగులకు హామీ ఇచ్చారు.