రోడ్డు వేయాలని కోరుతూ నూజివీడు జనసేన ఆద్వర్యంలో ధర్నా

  • మర్రిబంధం నుండి మోకాసనరసన్న పాలెం, పల్లెర్లమూడి రోడ్డు వేయకపోతే ఆర్ అండ్ బి కార్యాలయం ముట్టడిస్తాం
  • మోకాసనరసన్న పాలెం నుంచి మర్రిబంధం వరకు జరిగిన పాదయాత్ర సందర్భంగా జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరిక

నూజివీడు: రూరల్ మండలం మర్రిబంధం నుండి మోకాసనరసన్న పాలెం, పల్లెర్లమూడి రోడ్డు వేయకపోతే ఆర్ అండ్ బి కార్యాలయం ముట్టడిస్తాం అని జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం మర్రిబంధం టూ పల్లేర్లముడి రోడ్డు వేయాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముకాస నరసన్నపాలెం గ్రామ సచివాలయం నుంచి మర్రిబంధం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమం మర్రిబంధం నుంచి పల్లెర్లముడీ గ్రామాల్లో ముందుగా నిర్వహించి సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. మూడుసార్లు గెలిచానని చెబుతున్న ఎమ్మెల్యే నూజివీడు అభివృద్ధిని గాలికి వదిలేసారని విమర్శించారు. నూజివీడు మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము మాట్లాడుతూ స్పందనలో ఏలూరు జిల్లా కలెక్టర్ కి ఈ రోడ్డు సమస్యమై తెలియజేయగా రాతపూర్వకంగా అమౌంట్ శాంక్షన్ అయింది ఈ రోడ్డు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవటం లేదన్నారు. ఎం ఎన్ పాలెం గ్రామ జనసేన నాయకుడు షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ రోడ్డును వెంటనే వేయకపోతే నాలుగు గ్రామాల ప్రజలను చైతన్యం చేసి పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి మండలం అధ్యక్షులు ఆరేల్లి కృష్ణ, నూజివీడు మండలం ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్, సంయుక్త కార్యదర్శి సంతోష్, ముసునూరు మండల ప్రధాన కార్యదర్శి చలపాటి. ప్రేమ చంద్, వీర మహిళ జక్కుల లక్ష్మీ, మరీదు.లీల ప్రసాద్, రాంబాబు, తేజవత్. చెర్రీ నాయక్, నవన్, జయకృష్ణ, శివకుమార్, త్రినాథ్, పాపారావు, చతన్య, ప్రసాద్, కాంతారావు, బొర్రా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.