గజపతినగరంలో ఘనంగా జనసేనాని జన్మదిన వారోత్సవాలు

  • వారోత్సవాలలో భాగంగా గజపతినగరం జనసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

గజపతినగరం నియోజకవర్గం: జనసేనాని జన్మదిన వారోత్సవాలలో భాగంగా గజపతినగరంలో మొక్కల నాటే కార్యక్రమం మర్రాపు సురేష్ నాయకత్వంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. గజపతినగరంలో రైతు భరోసా, సచివాలయాలతో పాటు ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నేటి నుండి సెప్టెంబర్ 2 వరకు వారోత్సవాలు జరుపబడుతుంది. ఈ కార్యక్రమంలో జనసైనికులు కలిగి పండు, కడమల శ్రీను, పెనుమజ్జి ఆదినారాయణ, బూర్ల రాము, పైలా మహేష్, కనకల హేమసుందర్, శంకర్, సంతోష్, శేఖర్, అనిల్, అభి, సత్యనారాయణ పాల్గొన్నారు.