నంద్యాలలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

నంద్యాల: జనసేన పార్టీ ఆదేశాల మేరకు టిడిపి, జనసేన సంయుక్తంగా నిర్వహించిన “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” అనే కార్యక్రమాన్ని ఆదివారం నంద్యాల టీడీపీ ఇంచార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రోడ్లు వేయడంలో విఫలమయిందని నంద్యాలలో ఎటు చూసిన రోడ్లు ఆధ్వన్నంగా ఉన్నాయని సోషల్ మీడియాలో మాత్రం అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, రోడ్ల పరిస్థితి ప్రజలకు తెలియచేయడానికి జనసేన, టీడీపి కలిసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సాయి, సంజీవ రాయుడు, గురు, చిన్న, రవి, జీవన్, ఈశ్వర్, అశోక్, శ్రవణ్ సుబ్బు, బాబా తదితరులు పాల్గొన్నారు.