ఉద్యోగుల ఆందోళనకు జనసేన పార్టీ మద్దతు

అరకు, ఉద్యోగుల ఆందోళనలకు జనసేన పార్టీ మద్దతు కలుగుతుందని అరకు నియోజకవర్గం, అనంతగిరి మండల అధ్యక్షులు సిహెచ్ మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఖండించారు. సీఎం పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పీఆర్సీ అర్ధాన్ని మార్చివేశారు. ఉద్యోగుల పరిమితి పెంచమని వారు ఏనాడూ అడగలేదన్నారు. పదవి వీరమరణ పొందిన వారికి 20 లక్షల నుండి 70 లక్షల వరకు పేమెంట్ చేయాలన్నారు దాని నుండి తప్పించుకోవడానికి ఈ పెంపు అని అన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువత తమ అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. 7 డిఎల్ లు బాకీ ఉన్న ప్రభుత్వా న్ని ఏనాడూ చూడలేదని ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగ సంఘాలను ఆదుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సింహాద్రి పాల్గొన్నారు.