గంగారపు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

*#GoodMorningCMsir 3వ రోజు

మదనపల్లె నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు.. మొద్దునిద్ర పోతున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు చేపట్టిన కార్యక్రమం #GoodMorningCMsir ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఆదివారం మదనపల్లె నియోజకవర్గం, రామసముధ్రం మండలం చెంబకూరు పంచాయతీలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి ఆధ్వర్యంలో.. రామసముధ్రం మండల ఆధ్యక్షలు హోసూరు చంద్రశేఖర్ అధ్యక్షతన రొడ్ల దుస్థితి పై నిరసన తెలియజేడం జరిగింది. అదే విధంగా 3వ రోజు #GoodMorningCMsir కార్యక్రమంలో భాగంగా మదనపల్లె మున్సిపాలిటీ 17వ వార్డ్ శిథిలావస్థకు చేరుకున్న బుగ్గకాలువ బ్రిడ్జి గుర్తించిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి .. బ్రిడ్జి వద్ద నిరసన తెలియజేడం జరిగింది. అదే విధంగా 3వ రోజు #GoodMorningCMsir కార్యక్రమంలో భాగంగా మదనపల్లె మండలం బొమ్మనచెరువు మందబండ రహదారి మొలకవన రోడ్ దుస్థితి కారణంగా ఈ సంవత్సరంలో 8 పైగా యాక్సిడెంట్స్ జరిగిన ప్రదేశాన్ని గుర్తించి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి ఆధ్వర్యంలో.. నిరసన తెలియజేడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల ఆధ్యక్షలు హోసూరు చంద్రశేఖర్, ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె మండల ఆధ్యక్షలు గ్రానైట్ బాబు, చెంబకూరు విశ్వనాథ్, లక్ష్మీపతి క్రాంతి బంగారం, పద్మావతీ కొలనగవేని, సాయి కొండేటి, దేవేంద్ర పాల్గొన్నారు.