మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు విందు

రాజంపేట: రాజంపేటలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద గత 11 రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిసెట్టి వెంకటరమణ వారికి సంఘీభావం ప్రకటించి శుక్రవారం మధ్యాహ్నంవిందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మలిచెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, సుంకేసుల చౌడయ్య, అబ్బిగారి గోపాల్, ఆచారి, జనసేన వీరమహిళ పోలిశెట్టి రజిత, జడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు.