గుర్రాలపాలెంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

ఎచ్చెర్ల, లావేరు మండలం గుర్రాలపాలెం పంచాయతీలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి సోమవారం క్రియాశీలక సభ్యత్వ కిట్లను సభ్యత్వం తీసుకున్న గ్రామ జనసైనికులకు అందజేశారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఇంటి యజమాని అనుమతితో స్టిక్కర్లు అంటించి పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు మేనిఫెస్టోను గొప్పతనాన్ని వివరించడం జరిగింది. అర్జున్ భూపతి మాట్లాడుతూ… ఈ క్రియాశీలక సభ్యుత్వ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని, అలాగే అధ్యక్షులు వారు చేస్తున్న గొప్ప పనులను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని అక్కడ యువత అందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లావేరు మండలం నాయకులు బొంతు విజయ్ కృష్ణ, ఎంపిటిసి అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాసరావు, అప్పాపురం ఎంపిటిసి అభ్యర్థి అదపాక రాజు, గట్టెం చిరంజీవి, రాజరత్నప్రసాద్, సంతోష్, ఆరముడి రాము, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులు, గ్రామ పెద్దలు, జనసైనికులు, యువత పాల్గొన్నారు.