గోవిందరాజు పురంలో క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ

సర్వేపల్లి నియోజకవర్గం: సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం, గోవిందరాజు పురం గ్రామంలో శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఆ పార్టీ కార్యకర్తలకు గాని, నాయకులు గాని, వారి కుటుంబాలకు గాని అండగా ఉండాలి అనే ఆలోచన లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలు, నాయకులు, జనసేన సైనికుల కుటుంబాలకు అండగా క్రియాశీలక సభ్యత్వాలని రెండో విడత కొనసాగించి. అందులో భాగంగా ఈ శుక్రవారం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే క్రియాశీలక సభ్యుడు బైక్ యాక్సిడెంట్ అయితే 50వేల రూపాయల వరకు హాస్పటల్ ఖర్చులకి అదే విధంగా ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణాన్ని కోల్పోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా అందే విధంగా క్రియాశీలక సభ్యత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాలతోపాటు జనసైనికులకు జనసేన ఎప్పుడు అండగా ఉంటుంది. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను విముక్తి చేయడమే జనసేన లక్ష్యం. రాబోయేది జనసేన కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు జనసేన తోనే సాధ్యం. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల అధ్యక్షుడు ప్రసాద్, జనసేన నాయకులు సుధాకర్, సుబ్రమణ్యం, ఖాదర్ వల్లి, జాకీర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.