నల్లగొండ గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజానగరం, సీతానగరం మండలం, నల్లగొండ గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతుల చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. బుధవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబ సభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం నల్లగొండ గ్రామంలో జరిగింది. బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు సభ్యత్వం తీసుకున్న వారికి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమమని, దేశంలో ఏ పార్టీ కూడా ఇలాంతి కార్యక్రమాన్ని నిర్వహించలేదని, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి వారి కుటుంబాలకు అండగా నిలిచే మహోన్నతమైన కార్యక్రమమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం నాయకులు, నల్లగొండ గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.