లావేరు మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం.. ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్య నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్, వైస్ ప్రెసిడెంట్ డా. విశ్వక్షేణ్ అధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయ చంద్రశేఖర, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీమతి దుర్గా ప్రశాంతి, తాడే మోహన్, మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లకు సన్మానం మరియు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురిజా శ్రీను, రాజేష్, దుర్గారావు, కాకర్ల బాబాజీ, రాజారమేష్, గోల్లబాబు, సుర్య, శంకర్, దుర్గా రెడ్డి గారు, నాయుడు, పవన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.