క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్స్ ని ఘనంగా సన్మానించిన మాకినీడి..!!

*క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం 3.వ రోజు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గ పట్టణంలో.. జనసేన పార్టీ కార్యాలయం క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు.. జనసేన పార్టీ క్రియశిలక సభ్యత్వ నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం ఆదివారం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో.. జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో.. పిఠాపురం టౌన్ పిఠాపురం మండలానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి.. వారికీ సభ్యత్వం కార్డులు, కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారి ఆదేశాల మేరకు 10,11,12 తేదీలలో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి.. పిఠాపురం మండలం, పిఠాపురం నియోజకవర్గంలో సుమారుగా (5000) సభ్యత్వాలు 60 మంది వాలంటీర్లు చేయడం జరిగింది. పిఠాపురం రూరల్ మండలానికి చెందిన వెన్న జగదీష్ 1111 అత్యధికంగా.. సభ్యత్వాలు చేయించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు వారికి ప్రత్యేక అభినందనలు.. మన నియోజకవర్గంలో సభ్యత్వాలు చేయించిన ప్రతి వాలంటరీ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు.. అలాగే వీరందరికీ పార్టీ తరఫున అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రశంసా పత్రమును, పార్టీ జెండాను పంపించడం జరిగింది. ఇవి అన్నీ కూడా వారికి అందజేసి చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యులను సొంతం గా భావించి వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న మా అధ్యక్షులు కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ.. ప్రతి క్రియాశీలక సభ్యులు పార్టీకి బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అలాగే ఈ మూడు రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు క్రియాశీలక కిట్లు పంపిణీ కార్యక్రమానికి సహకరించిన నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు అభినందనలు. కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, కడారి తమ్మయ్య నాయుడు, గోపు సురేష్, జనసేన గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, మాజీ కౌన్సిలర్లులు వేణు నారాయణరావు, కర్రీ కాశీ విశ్వనాథ్, రాచకొండ వీర వెంకట సత్యనారాయణ, ఏనుగంటి హరిబాబు, మాదేపల్లి పద్మరాజు, లీగల్ అడ్వకేట్లు సిరిరెడ్డి గణేష్, కామిశెట్టి సత్యవేణి, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, వినుకొండ అమ్మజి, రాచకొండ వీర వెంకట సత్యనారాయణ, ఏనుగంటి హరిబాబు, యండ్రపు శ్రీనివాస్, కంద సోమరాజు, శిగటాపు నారాయణరావు, బస్వా కృష్ణ,దేశరెడ్డి సతీష్, తేలు దొర, బస్వా గోపి, నిమ్మ దుర్గ, గొల్లపల్లి గంగ, స్వామిరెడ్డి సుబ్రమణ్యం, కొజ్జా కుమార్, మేళం బాబి, కాళ్ల రాజు, భీమరాజు, గంగిరెడ్ల సూరిబాబు, దువ్వ వీరబాబు, కర్రీ హరిబాబు, కంద సోమరాజు, దొడ్డి దుర్గాప్రసాద్, వంకా కొండబాబు, పబ్బినేడి దుర్గాప్రసాద్, నమ శ్రీకాంత్, బొజ్జ కుమార్, రోకళ్ల వెంకట్ లక్ష్మి, తోట సతీష్, కసిరెడ్డి నాగేశ్వరరావు, నియోజవర్గ నాయకులు వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.