నక్షత్ర హెల్ప్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాకారంతో దుప్పట్ల పంపిణీ
రాజోలు, నక్షత్ర హెల్ప్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాకారంతో జనసేన నాయకులు పంచదార చినబాబు, సుదా మోహన్ ఆధ్వర్యంలో పొదలాడ గ్రామంలో దుప్పట్లు పంపిణి కార్యక్రమం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా పొదలాడ సర్పంచ్ కడలి సత్తిపండు, ఎంపీటీసీ శిరిగినిడి వెంకటేశ్వరరావు, వార్డ్ మెంబెర్ కొల్లాబత్తుల సతీష్ మరియు తాటిపాక జనసేన ఎంపీటీసీ అభ్యర్థి పెచ్చెట్టి అర్జున్, సలాది దొరబాబు, మేడిచర్ల రామకృష్ణ మరియు సంఘ సేవ నాయకులు పాల్గొన్నారు.