రాయపరెడ్డి కృష్ణ సహకారంతో మజ్జిగ పంపిణీ

మాడుగుల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన మాడుగులలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ సహకారంతో మాడుగుల మండల జనసేన నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనకు ఒక అవకాశం ఇద్దాం అనే నినాదంతో కూడిన కరపత్రాలను ప్రజలకు మాడుగుల సెంటర్లో గల వ్యాపారస్తులకు అందజేయడం జరిగింది. రాయిపురెడ్డి కృష్ణ మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గాన్ని గతంలో టిడిపి, కాంగ్రెస్ ప్రస్తుతం వైసిపి పరిపాలించినా నియోజకవర్గం ఎప్పటిలాగే ఉంది తప్ప ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని. రాబోయే ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.