జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కుల పంపిణీ

ముమ్మిడివరం నియోజకవర్గం, ముమ్మిడివరం మండలం, అనాతవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు గెడ్డం శ్రీనివాసరావు, మరియు కొమానపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఆదినారాయణ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. వారిరువురూ జనసేన పార్టీ క్రియాశీలక సబ్యత్వం కలిగిఉన్నందున వారి కుటుంబ సభ్యులకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పంపిన 5లక్షలు రూపాయల ప్రమాద భీమా చెక్కులను ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రిలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.