జనసేన కార్యదర్శి కొట్టే సాయి ఆధ్వర్యంలో పేద పిల్లలకు బట్టల పంపిణీ

శ్రీకాళహస్తి: సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆధ్వర్యంలో పేద పిల్లలకు బట్టల పంపిణీ. సోమవారం శ్రీకాళహస్తిలోని లంకమిట్టా ఎస్టీ కాలనీలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆ ప్రాంతంలోని పేద పిల్లలకి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొట్టే సాయి మాట్లాడుతూ సంక్రాంతికి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందని, పేద బడుగు బలహీన వర్గాలకి చెందిన ప్రజలు గొప్ప చదువులు చదివి ఉన్నతమైన స్థానానికి ఎదిగి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు. మీ విద్య, వైద్యం, భద్రత మొదలైన విషయాలలో మీకు ఏ సమస్య వచ్చిన జనసేన పార్టీ మీకు తోడుగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అలాగే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాలనికాలనీ వాసులను కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, మాధవ మహేష్, అరిగల వేణు గోపాల్, ఢిల్లీ బాబు, చిరంజీవి, రాఘవ, నారాయణ, ప్రసాద్, చైతన్య, మోహన్, చోటు, రమేష్ మరియు సురేష్ తదితరులు పాల్గొన్నారు.