గోపాలపురం మండలంలో మద్దిపాటి వెంకటరాజు ఇంటింటి ప్రచారం

గోపాలపురం మండలం, తొక్కిరెడ్డిగూడెం, గుడ్డిగూడెం గ్రామాల్లో శనివారం ఉమ్మడి అభ్యర్ధి మద్దిపాటి వెంకటరాజు చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది. గుడ్డిగూడెం మరియు తొక్కిరెడ్డిగూడెం ఇరు గ్రామ ప్రజల దగ్గర నుంచి మంచి విశ్లేషణ స్పందన వచ్చింది. వెంకటరాజుకి పొత్తు సిద్దాంతం ప్రకారం సువర్ణరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండలం ఉపాధ్యక్షులు పోసిన గణపతి, భీమోలు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఉమా, కొవ్వూరుపాడు గ్రామ అధ్యక్షులు ప్రగడ రాంబాబు, హుక్కుంపేట గ్రామ అధ్యక్షులు గేరా ఫణి, టీడీపీ మండల అధ్యక్షులు రొంగ సత్యనారాయణ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.