గోపాలపురంలో వైభవంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలంలో జనసేన పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం మరియు సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లకు ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, గోపాలపురం మండల అధ్యక్షులు పొన్నటి రాజేంద్ర, నల్లజర్ల మండల అధ్యక్షులు చోడసాని బాపిరాజు, రుద్ర శ్రీను, మరియు మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, వీర మహిళలు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.