వెంగమనాయుడు కాలనీలో జనసేన క్యాలెండర్ల పంపిణీ

అనంతపురం జిల్లా, తాడిపత్రి 2023 నూతన సంవత్సర సందర్భంగా యాడికి మండలం వెంగమనాయుడు కాలనీలో క్యాలెండర్లను పంచడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ క్యాలెండర్లను రూపొందించారు వీటితోపాటు జనసేన పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రచురించినట్లు తెలిపారు. క్యాలెండర్లతో పాటు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసులు కూడా పంచారు. ఈ కార్యక్రమంలో వెంగమనాయుడు కాలనీకి చెందిన జనసైనికులు మధు, ఆచారి, నాగభూషణం, మల్లికార్జున, పప్పు వెంకటేష్, మహేష్, రాము తదితరులు పాల్గొన్నారు.