బొడ్డపాడు గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ కిట్ల పంపిణి

ఆమదాలవలస నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం బూర్జ మండలం, హనుమయ్య పేట, బొడ్డపాడు గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. మరియు జనసేన పార్టీ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎల్లప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మౌళి, శ్రీను, సంతోష్ నాయుడు, మోహన్, కోమల్, హేమంత్, ప్రసాద్, శ్రీరామ్ మూర్తి, రాజ, జగదీశ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియజేసారు.