కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటికి ఘన నివాళులు

కొయ్యలగూడెం: సోమవారం వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక గణపతి సెంటర్ వద్ద వంగవీటి మోహన్ రంగాకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు గ్రామస్తులు యువకులు మరియు కాపు పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కాపు సేవాసంఘం మరియు కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో దుగ్గిన శ్రీను అధ్యక్షతన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మొదటగా పరింపూడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నపంచాయతీ ప్రెసిడెంట్ ముప్పిడి విజయ్ కుమారి చేతుల మీదుగా రంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పెద్దలు తాటికొండ మురళి చోడి పిండి సుబ్రహ్మణ్యం పైడిముక్కల కృష్ణ ఉపసర్పంచ్ సంకుకొండ, కాపు సంక్షేమ సేన మండల ప్రెసిడెంట్ సంకు మధు బాబు, జుంగ బాబ్జి, చిన్నం గంగాధర్ రావు, మేకల తేజ, నక్క బాబి, అడప సత్తిబాబు, టెలిఫోన్ శేఖర్, పెద్దమల్ల పండు, ఆరేటి బాబి, ఏపూరి సతీష్, మేడిన కన్నయ్య, రామకృష్ణ, మేఘన, కార్తీక్, కూచిమంచి శ్రీను, కృష్ణ సంకు, కృష్ణ, పెదపూడి స్వామి, బిల్లూరి ఉదయ్, ఆకాష్, అభిరామ్, నాగు తదితరులు రంగాకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రంగా చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన పేదవారికి ఏ విధంగా ఆరాధ్యుడు అయ్యాడో అన్న అంశాలు, ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయన మరణించేటప్పుడు ముందు జరిగిన విషయాల గురించి, పెద్దలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముప్పిడి చినబాబు, జేష్ట రామకృష్ణ, పారేపల్లి రామారావు పాల్గొని రంగాకి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ కాపులందరు ఐక్యతగా ఉంటూ బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకంగా ఉండాలని రంగా ఆశయాలను ప్రతీ గ్రామానికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువత రంగా గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.