పాడేరు జనసేన ఆధ్వర్యంలో నూతన వస్త్రాల పంపిణీ

చింతపల్లి జనసేన పార్టీ, పాడేరు నియోజకవర్గ కార్యదర్శి ఉల్లి సీతారామ్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామస్తులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అదేశాలమేరకు సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన ఊరు మన ఆట కార్యక్రమం చేత గ్రామ స్థాయిలో ముగ్గుల పోటిలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయనున్నామన్నారు. ఈ సందర్బంగా పాడేరు నియోజకవర్గ ప్రజలకు జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. గంగులయ్యకి జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు వీరమహిళలకు, జనసైనికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, ఉపాధ్యక్షులు వంతల రాజారావు, కూడా అబ్బాయి దొర, వంతల శేఖర్ పాల్గొన్నారు.