జనసేన యువత ఆధ్వర్యంలో అన్న ప్రసాదం, మజ్జిగ పంపిణీ

విజయనగరం, గాజులరేగ గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి 70వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా జనసేన యువత ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, జనసేన నాయకులు గురాన అయ్యలు పాల్గొన్నారు. ముందుగా ముత్యాలమ్మ వారి కోవెలలో, పైడితల్లమ్మ సన్నిధిలో అమ్మవార్లని దర్శనం చేసుకుని అనంతరం ప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా యశస్వి, గురాన అయ్యలు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్ఫూర్తితో జనసైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు, జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.