అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు అవార్డుల పంట

విజయనగరం: శ్రీకాకుళం లో ఆదివారం, వాకర్స్ ఇంటర్నేషనల్ (డిస్ట్రిక్ట్-102)18వ కాన్ఫరెన్స్ లో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు ఉత్తమ కొత్త క్లబ్ ప్రెసిడెంట్ గాను, ఉత్తమ వైద్య శిబిరాలనిర్వహణకు గాను అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు)కు, మరియు ఉత్తమ జాలీవాకర్ గా లోపింటి కళ్యాణ్ కు అవార్డ్ లు వచ్చాయని తెలియజేసారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మనం నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యము అనే నినాదంతో పద్మభూణ్ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోే వాకర్స్ క్లబ్ ను స్థాపించామని, ఇదే స్ఫూర్తితో ఇంకెన్నో సేవలతో ముందుకెళ్తామని అన్నారు. క్లబ్ సేవలను గుర్తించిన డిస్ట్రిక్ట్ -102 గవర్నర్ పి.జి.గుప్తాకు, వాకర్స్ క్లబ్ కు ఆదర్శ మూర్తులు డాక్టర్ ఏ.ఎస్.ప్రకాశరావు మాస్టారు, ఆరికతోట తిరుపతిరావు, నాలుగెస్సలరాజు, మరియు డిస్ట్రిక్ట్-102, మాజీ గవర్నర్ జి. కృష్ణంరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు అవార్డులు రావటంతో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జనసేన నాయకులు, అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు అభినందనలు తెలిపారు.