అత్తిలి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా క్రియాశిలక సభ్యత్వ కిట్ల పంపిణి

అత్తిలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వీరమహిళ శ్రీమతి కాట్నం విశాలి మరియు అనుకుల రమేష్. జిల్లా కార్యాదర్శి అన్నెం విశ్వప్రభు, బడేటి కృష్ణ కలిసి సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్లను సత్కరించారు. అనంతరం సభ్యత్వం తీసుకున్నవారికి కిట్లను అందజేశారు. ఈ సందర్భంలో పలువురు మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవశ్యకతను రాబోయే రోజుల్లో పార్టీ బలోపితం దిశగా అడుగులు వేసి రాబోయే ఎన్నికల్లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని సీఎం చేయటమే తమ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దువ్వ జనసైనికులు రుద్ర సతీష్, అత్తిలి మండల జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి సహకరించిన వారికి విచ్చేసిన వారికి అత్తిలి జనసేన పార్టీ తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.