2000 పేద సామాన్య కుటుంబాలకు సంక్రాంతి కానుక పంపిణీ

జగన్ గారి పాలనలో సంక్రాంతి పండగ ఎక్కడ ?
నిత్యవసర సరుకుల రేట్లు పెరుగుదలతో పిండివంటలకు దూరమైన సామాన్య ప్రజలు.
సామాజిక వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిని చెప్పుతీసి కొట్టండి.
టిడ్కో ఇళ్ల గృహప్రవేశం ఎప్పుడు? సెంటు భూమి అడవుల్లో ఇస్తే తీసుకోవాలా ?
పండగ చేసుకోవడానికి 2000 లేవు వన్టైమ్ సెటిల్మెంట్ కింద 20,000 ఏవిధంగా చెల్లిస్తారు?

జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ 40వ డివిజన్ అధ్యక్షులు, ఐజా గ్రూప్ చైర్మన్, రజా కమిటీ ప్రెసిడెంట్ షేక్. గయసుద్దిన్ ఆధ్వర్యంలో 2000 పేద సామాన్య కుటుంబాలకు 11 రకాల తో కూడిన నిత్యావసర సరుకుల సంక్రాంతి కానుక కిట్స్ పంపిణీ కార్యక్రమం భవాని హాస్పిటల్ రోడ్డు నాగార్జున వీధి భవానిపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు.