రేచర్ల పేటలో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు సోమవారం జనసేన సిటి సహాయ కార్యదర్శి కంట రవిశంకర్ ఆధ్వర్యంలో చోడిశెట్టి శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో రేచర్ల పేటలో దివ్యాంగుల భరోసా యాత్ర జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులను కలిసి వారి సమస్యలపై చర్చించి భరోసానిచ్చే ప్రయత్నం చేసారు. ఒకానొక కాలంలో సరైన అవగాహన లేక మేనరిక వివాహాలవల్ల మరియు ఇతర కారణాలతో జన్యుపరమైన లోపాలతో పిల్లల జననాల వల్ల చాలా వేదనతొ బ్రతుకులు సాగించేవారనీ, కానీ నేడు ఆధునిక కాలంలో సమస్య తీవ్రతను నిరోధించగలిగినా ప్రభుత్వాల అలసత్వం వల్ల పూర్తిగా నిరోధించలేకపొతున్నామన్నారు. నేటి ఈ వై.సి.పి ప్రభుత్వ పాలనలో వేక్సినేషన్ కార్యక్రమాన్ని ఫలవంతంగా అమలుచేయట్లేదనీ, ఏదైనా ప్రశ్నిస్తే నిధుల కొరత అంటున్నారన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడే సరైన వైద్యం ఈ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అందిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది కదా అప్పుడు ఈ అనవసర ప్రయాస ఉండదుగా అన్న చిన్న ఆలోచన రాకపోవడం కేవలం ఈ ప్రభుత్వ బుద్ధి మాన్యత అని విమర్శించారు. దివ్యాంగుల భద్రత సంక్ష్యేమం కోసం తాము కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పచ్చిపాల మధు, నాని
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ మరియు స్థానికులు పాల్గొన్నారు.