మనోభావాలు దెబ్బతీసే ఫ్లెక్సీలను తొలగించాలి – జనసేన డిమాండ్

పిడుగురాళ్ల పట్టణంలో జనసైనికులను కించపరిచే విధంగా వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్స్ ని 24 గంటల్లో.. తొలగించకపోతే చర్యకు ప్రతి చర్య ఉంటుందని పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశీం సైదా హెచ్చరించారు. పిడుగురాళ్ల పట్టణంలో జానపాడు రోడ్డు మరియు ఆంధ్రా బ్యాంక్ సెంటర్, రాజస్థాన్ టీ స్టాల్ సెంటర్, మరియు ఫ్లైఓవర్ వద్ద వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదుచేసి, శాంతిభద్రతలకు విగాథం కలిగేలా చేసిన వైసీపీ నాయకులను అరెస్టు చేసి వెంటనే బ్యానర్లు తొలగించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జనసైనికుల మనోభావాలు దెబ్బతినేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా వైసిపి నాయకుల తీరు చాలా దుర్మార్గమని, ఈ చర్యల వల్ల రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తుందని, 24 గంటల్లో బ్యానర్స్ పూర్తిగా తొలగించాలని లేనిపక్షంలో చర్యకు ప్రతి చర్య ఉంటుందని, ఈ విషయంలో ఎటువంటి అల్లర్లు జరిగినా పూర్తిగా వైసిపిదే బాధ్యతని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షుడు బయ్యవరపు రమేష్, పెడకోలిమి కిరణ్ కుమార్, జానపాడు గ్రామ ప్రధాన కార్యదర్శి అంబటి సాయికుమార్, జనసేన నాయకులు సూరం నాగమల్లికార్జునరావు, మొదలగువారు పాల్గొన్నారు.