పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు

కష్టకాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రజలపాలిట దేవుడుగా మారాడు. సాయం చేయాలంటూ తనకు వస్తున్న ఫోన్లు, మెసేజ్ పైనే కాకుండా సామాజిక మాద్యమాల ద్వారా, మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రజల కష్టాలను గురించి తెలుసుకొని ఆయన సాయం చేస్తున్నారు. వలసకార్మికులకు సహాయం చేసి దేశవ్యాప్తంగా ప్రసంశలు అందుకున్నాడు. తాజాగా జేఈఈ, నీట్‌ పరీక్షల లను వాయిదా వేయాలని కోరాడు సోనూసూద్. జేఈఈ, నీట్‌ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను వాయిదా వేయాలని సోనూసూద్ కోరారు. ఈ పరీక్షలు జాతికి కొత్త శక్తిని అందిస్తాయని నేను నముతున్నానని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షలు రాయాలని బలవంతం చేయకూడదని, జేఈఈ, నీట్ పరీక్షలను మరో రెండు నెలలపాటు వాయిదా వేయాలని అన్నారు. ఓ వైపు కరోనా కోరలు చాస్తుంది…మరో వైపు వరదలతో కొన్ని రాష్ట్రాలు అల్లకల్లోలమవుతున్న నేపధ్యంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దని, పరీక్షలను వాయిదా వేయాలని. ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా సుమారు 26 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారని, వీరిలో బీహార్‌కు చెందిన 12, 13 జిల్లాలకు చెందినవారు ఉన్నారని వారంతో వరదలతో తీవ్రంగా నష్టపోయారని అక్కడిప్రజలకు ఉండటానికి ఇల్లుకూడా లేని పరిస్థితి వారికి మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎలా ప్రయాణం చేయగలరని ప్రశ్నించారు. వారంతా మానసికంగా సిద్ధమైనప్పుడే పరీక్షలు నిర్వహించాలని సోనూసూద్ కోరారు.