విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: జనసేన డిమాండ్

*విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తరఫున జనసేన మిమ్మల్ని ప్రశ్నిస్తోంది

*విద్యుత్ కోతలు మీరు కోసీ, విద్యార్థుల భవిష్యత్తు మీద కోతలు కోయవద్దు

*మీకు మీ గ్రామ వాలంటీర్లు మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదు

*విద్యార్థుల బంగారు భవిష్యత్ కు వైసిపి నాయకులు అడ్డు పడవద్దు

ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పరీక్షలు సమయం. రాష్ట్రంలో వైసీపీ నాయకులకు “గ్రామ వాలంటీర్లు” మీద ఉన్న ప్రేమ విద్యార్థులు మీద లేదు, వైసీపీ నాయకులు అధికారులను వాళ్ల గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. అధికారులను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క విధులను వారు నిర్వహించకుండా ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుల తీరు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది, పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించడం సరైన పద్ధతి కాదు.. ఈ విషయంపై జనసేన పార్టీ తీవ్రంగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు, మిమ్మల్ని ప్రజలందరూ పల్లకి ఎక్కించింది రాష్ట్రాన్ని అభివృద్ధి పరచమని మాత్రమే, అంధకారంలో ఉంచమని కాదు, విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు మీరు విద్యుత్ కోతలు విధిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు, విద్యార్థులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. విద్యుత్ కు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నుండి మేము మీకు విజ్ఞప్తి చేస్తూ మరియు డిమాండ్ చేశారు.