విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయొద్దు సీఎం సారూ..!! మా బిడ్డల బతుకులు బుగ్గి పాలు చేయకండి.

రాజోలు నియోజక వర్గంలో చింతలపల్లీ గ్రామంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటుపల్లి ఆనంద రాజు ఆధ్వర్యంలో జరిగిన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేసిన రాష్ట్రంలో ఉన్న 24 మంది ఎంపీ లకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సామరస్యంగా డిజిటల్ విధానంలో విన్నూత్న మైన రీతిలో మహిళ రైతు కూలీలు నిరసన తెలియ చేశారు, కులి పనులు చేసుకుని బిడ్డలను మంచి ప్రయోజకులను చేయాలని దేశానికే తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారం లాంటి వాటిలో ఉద్యోగాలు వస్తె మా మట్టి బతుకులు బాగుపడతాయి ఎంతో ఆశతో ఉన్నాము కాని ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో మా ఆశల మీద రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు చల్లుతొందని ఉద్యోగ నియామకాలు కృత్రిమ కొరత ఏర్పరుస్తుంది అని మహిళ రైతు కూలీలు నిరసన తెలియ చేశారు. మేము ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ లు పార్లెంటులో ప్లకార్డులతో మా తరుపున నిరసన తెలియ జేయలని అన్నారు మరియు రాబోవు రోజుల్లో జనసేన పార్టీ చేసే ప్రజా పోరాటాల్లో మేము బలంగా సేనాని వెంట నడుస్తాము అని తెలియ చేశారు.