ఇరు పార్టీల నాయకులకు అభివృద్ధిపై ప్రమాణం చేసుకునేంత నైతికత విలువ ఉందా..?

పుట్టపర్తి, ఇరు పార్టీల నాయకులకు అభివృద్ధిపై ప్రమాణం చేసుకునేంత నైతికత విలువ ఉందా..? కొత్తచెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉన్న శ్రీ సత్య సాయిబాబా వారి ప్రతిష్టను దెబ్బతీశారు, గుడి ప్రాంగణంలో చెప్పులు విసురుకుని దేవాలయంలో పడే విధంగా మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. పుట్టపర్తి నియోజవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే శ్రీ సత్య సాయిబాబా వారి ఆశీస్సులతో మరియు ఆర్.డి.టి వారి సహకారంతో జరిగింది తప్ప మీరు చేసింది ఏముంది..? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇద్దరూ అధికారాన్ని అనుభవించారు, ఒకరు రెండున్న సంవత్సరం ఐటి మంత్రిగా చేశారు. నియోజకవర్గంలో పెట్టిన పరిశ్రమలు ఎన్ని…? విద్యాసంస్థలు బోలెడన్ని ఉన్న నియోజకవర్గంలో పెట్టినవి ఎన్ని..? నల్లమాడ, ఒడిసి, అమడుగురు మండలాలలో పైచదువులు చూడడానికి ఎటువంటి సౌకర్యాలు లేక దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎంతోమంది నియోజకవర్గంలో పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. వీరిలో ఎవరి వద్ద నుంచి అయినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా..? నియోజకవర్గంలో కరోనా మరియు వరదల సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీ ఇరువురు నాయకులు ఎక్కడికి వెళ్లారు..? వరదలు వస్తే బుక్కపట్టణం జలదిగ్బంధనం అవుతోంది, ధర్మవరం రోడ్డు కోడపగాని పల్లి అవతల వరదలు వస్తే ఇదే పరిస్థితి. ఎందుకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయలేదు..? నియోజవర్గంలో ఏ మండల కేంద్రంలోనైనా సరైన బస్టాండ్ వసతులు ఉన్నాయా..? బుక్కపట్నం కొత్తచెరువులో ఉన్నా కూడా దానిది దయనీయ పరిస్థితి. ఒక్కో జిల్లాకు ఒక విమానాశ్రమమన్నారు. ఈరోజు మనకు ఉన్న దానిని కూడా వినియోగింప చేయలేకపోతున్నారు. పుట్టపర్తికి హాస్పిటల్ మంజూరు అయితే, ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవడం లేదు. సాంక్షన్ అయ్యింది కూడా ఈరోజు వెనక్కి పోయే పరిస్థితిలో ఉంది. స్థలాలు మరి ఏచోట మీకు దొరకడం లేదా..? కిడ్నీ సమస్యల ద్వారా ఇబ్బంది పడుతున్న నా సోదరులు ఎంతోమంది డయాలసిస్ కోసం హిందూపురం లేదా అనంతపురం పోవలసిన పరిస్థితి. జిల్లా అయి ఉండి ఏం ఉపయోగం..? ఇళ్ల పట్టాలు మేము ఇచ్చాము మేము ఇచ్చామని చెప్పుకునే మీరు అక్కడ గుడికి, బడికి ఎక్కడైనా స్థలాన్ని కేటాయించారా…? అక్కడ నివసించేవారు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్తారు..? మరి వ్యక్తిగతంగా సైట్లు వేస్తుంటే తప్పకుండా 10 శాతం స్థలం వదలాలని మీరే రూల్ పెట్టారు ఇప్పుడు మీరు చేసింది ఏమి..? నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడుతోంది అని, కొత్త నాయకత్వాన్ని అణిచివేయాలని కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి స్వలాభం పొందడానికి ఇద్దరూ కూడ పలుకుకొని రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎలక్షన్లలో జనసేన పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తాము అభివృద్ధి ఏంటో చూపిస్తాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, దోడ్డిగుంట నరేంద్ర భూపతి, మేడాపురం సల్లప్ప, ముత్యాల కరుణాకర్, సాకే తేజ ప్రదీప్, సాకే చిరంజీవి, దాసరి నాగార్జున, సోలంకల చంద్ర, రఘుపతి ఇతరులు పాల్గొన్నారు.