పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకుంటున్న ఎమ్మెల్యే కు తిరుమలమ్మ పాలెం కనిపించడం లేదా?

*జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ బాబు

నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం కేంద్రంలోని తిరుమలమ్మ పాలెం గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ బాబు పర్యటించారు. పర్యటించి అక్కడ సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. పై కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్ధ కాలాల నుంచి తిరుమలఅమ్మ పాలెం వర్షాకాలంలో వరద నీటితో పూర్తిగా ముంపుకు గురవుతున్న, ఏ పార్టీ అధికారంలో ఉన్నా దాని వంక చూడకపోవడం గమనార్హం. ప్రతిసారి ఎన్నికల సమయంలో గ్రామంలో పర్యటించి కచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తామంటూ, ఏదో సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు వచ్చినట్టు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి పోవడం తప్ప ఏమీ వెలగబెట్టారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.వరుసగా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలిచి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకోవడం తప్పా ఆయన ఏం వెలగబెట్టారు అంటూ వ్యాఖ్యానించారు. ఇకనైనా తిరుమలఅమ్మపాలెం గ్రామానికి వంతెన వేసి ఆ గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని లేదంటే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున తిరుమల అమ్మపాలెం గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రహీం బాయ్ సందీప్, శ్రీహరి, వంశీ, సాయి శ్రీను తదితరులు పాల్గొన్నారు.