రక్తదానం ప్రాణదానంతో సమానం

  • చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
  • ప్రజలకు జనసేన ఆవశ్యకతను వివరించాలి

నెల్లూరు: మనం చేసే రక్తదానంతో ఇతరుల ప్రాణాలు కాపాడొచ్చని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ తెలిపారు. చిట్టమూరు మండలం జనసేన, కొగిలి యువత జనసేన పార్టీ, తిరుపతి పార్లమెంట్ అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం, కొగిలి గ్రామంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్బంగా తీగల చంద్ర శేఖర్ మాట్లాడుతూ జనసైనికులు సేవా కార్యక్రమాలతో పాటుగా జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ఇంటిఇంటికి తీసుకెళ్లి జనసేనకు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియచేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. అనంతరం జనసేన నాయకులు క్రాంతి, అక్బర్, ప్రవీణ్, రాము, నయాజ్ లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా 72 మంది యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్ మరియు పట్టణ ప్రధాన కార్యర్దర్శి నాగార్జున మరియు చిట్టమూరు మండల జనసేన నాయకులు క్రాంతి, ప్రవీణ్, అక్బర్ కుమార్, భాస్కర్, రాము వినోద్, కోటి, నయాజ్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.