దళిత కుటుంబాలకు జనసేన పార్టీ ఎపుడూ అండగా ఉంటుంది

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో దళితులపై జరిగిన దాడిపై విచారణ కొరకు బుధవారం ఎపి ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ బాధితుల్ని విచారించి.. ముద్దాయిలు 14 మంది వ్యక్తులపై తక్షణమే రౌడీషీటర్ ఓపెన్ చేయవలసిందిగా.. పోలీస్ అధికారులను ఆదేశించారు. దాడికి పాల్పడిన వారికి ఆసరా ఇచ్చినందుకు మువ్వల రామ్ రెడ్డి ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ప్రభుత్వం నుంచి వారికి కేటాయించిన సహాయం అందించాలని.. ఆర్ డివో ని ఆదేశించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు ఎపి ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ కీ దళిత కుటుంబాలకు ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, జనసేన నాయకులు, కాసుల శ్రీనివాస్, గుంటుపల్లి శ్రీనివాస్, అనుమల శెట్టి కిరణ్ బాబు, సంకే నాగరాజు, షేక్ వాహిద్, పసుమర్తి నాగేశ్వరరావు, చొప్పర రానా, శీలం సాయి, హరిబాబు, నామ మహేష్, వెంకటేష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.