శిథిలావస్థలో వున్నతుఫాన్ రక్షిత భవనాన్ని పట్టించుకోరా?

  • సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి: వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామంలోని తుఫాన్ రక్షిత భవనాన్ని గ్రామస్తులతో కలిసి బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ.. తుఫాన్, వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను తుఫాన్ రక్షిత భవనాలకు తరలిస్తారు, అయితే ఆ తుఫాన్ రక్షిత భవనాలకు బీటల వాలి అస్తవ్యస్తంగా ఎప్పుడు కూలిపోద్దో తెలియని విధంగా ఉంటే ఆ రక్షిత భవనం తుఫాన్ వచ్చినప్పుడు ప్రజలను ఏ విధంగా రక్షిస్తుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారా?. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్లలేకపోతున్నారా?. ఆయన మాటలు మీడియా వరకేనా, ఆయన అభివృద్ధి పేపర్ కాగితాల వరకైనా.. గ్రామాలలో ఏమైనా అభివృద్ధి చేసేది ఉందా, సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు సరైన అభివృద్ధి పనులు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ గెలవాలనుకోవడం సిగ్గుతో కూడిన విషయం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఈసారి డిపాజిట్లు కూడా రానీకుండా ఇంటికి పంపించడం ఖాయం. 2024లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న ప్రధాన సమస్యలన్నిటిని కూడా జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పరిష్కరిస్తాయి ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీహరి, మండల నాయకులు సుమన్, ఖాజా, విజయ కుమార్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.